విజయ్ దేవరకొండ మరో సంచలనం.. సౌత్ నుండి మొదటి హీరో
on Jun 14, 2021
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లిస్ట్ లో నేషనల్ వైడ్ గా సెకండ్ ప్లేస్ లో నిలిచిన విజయ్.. తాజాగా మరో సంచలనం సృష్టించాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు.
డబూ రత్నాని క్యాలెండర్ లో బాలీవుడ్ స్టార్ ల సరసన విజయ్ కనిపించాడు. సౌత్ నుండి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ కావడం గమనార్హం. చేసిన 9 సినిమాలకే నేషనల్ వైడ్ గా ఇంతటి క్రేజ్ సంపాదించడం విశేషం. దీనికి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గుడ్ అండ్ స్టైలిష్ లుక్ లో విజయ్ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన సందర్భంగా విజయ్ తో ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో ముచ్చటించాడు డబూ.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "ఈ ఫొటో షూట్ చాలా ఫాస్ట్ గా, చాలా క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్ లో కనిపించారు. నేను షారుఖ్ ఖాన్ సర్ ను మీ క్యాలెండర్ లో చూసా. అప్పటినుండి నేను మీ క్యాలెండర్ లో కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఫైనల్ గా నా కోరిక తీరింది. " అని చెప్పాడు.
డబూ రత్నాని మాట్లాడుతూ.. "థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్ లో డెబ్యూ చేసినందుకు. మీరు చాలా కూల్ పర్సన్. ఈ ఫొటో షూట్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాను. నా క్యాలెండర్ లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే. థాంక్యూ." అన్నాడు.