నా కారులో ఏమున్నాయ్?
on Jun 17, 2022
అరియానా గ్లోరీ బుల్లితెర మీద బిగ్ బాస్ తో అలాగే ఆర్జీవీ ఇంటర్వూస్ తో మంచి ఫేమస్ అయ్యింది. ఐతే అరియానా రీసెంట్ గా ఒక వ్లాగ్ చేసింది. అందులో తన కారులో ఏమేమి పెట్టుకుంటుందో మొత్తం చెప్పింది. తన డాష్ బోర్డులో పర్ఫ్యూమ్స్ అన్ని రకాలవి ఉంచుకుంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరినన్నా మీట్ అయ్యేటప్పుడు తాను ఈ పర్ఫ్యూమ్స్ ని వాడుతుందని చెప్పింది. అలాగే మేకప్ కిట్ ప్రత్యేకంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక పౌచ్ లో పెట్టుకుని డాష్ బోర్డులో పెట్టుకుంటుంది. ఐతే ఇంట్లో ఉంటుంది... లేదంటే కార్లో షికారుకి వెళ్లడం ఇష్టమట ఆమెకు.
ఆల్రెడీ ఒక కార్ ఉందనీ, తర్వాత రెండో కార్ కొన్నాననీ చెప్పింది. ఐతే తనకో సెంటిమెంట్ కూడా ఉందట. ఫస్ట్ కార్ కొన్నప్పుడు పెద్ద ఆక్సిడెంట్ అయ్యిందని కానీ తనకేం పెద్దగా గాయాలు కాలేదని చెప్పింది. ఎందుకంటే జీసస్ క్రాస్ ఎప్పుడు తన కారులో సెంటిమెంట్ గా ఉంచుకుంటుంది అరియానా. ఇప్పుడు అదే క్రాస్ ని సెకండ్ కార్ లో కూడా పెట్టుకుంది. అలాగే ఒక బుక్ కూడా మెయింటైన్ చేస్తుందట. ఎప్పుడైనా తనలో కవి మేల్కొంటే వెంటనే ఆ ఆలోచనలను ఆ బుక్ లో నోట్ చేసుకుంటుందట. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ డీటెయిల్స్, డబ్బులు ఇవ్వాల్సినవి, రావాల్సిన వివరాలు అన్ని అందులో ఉంటాయని చెప్పింది. ఆ బుక్ కి పెన్ అటాచ్ చేసి పెట్టుకోవడం ఇష్టం అని చెప్పింది. ప్రతీ సారి పెన్ కోసం వెతుక్కోవడం చిరాకు.. అందుకే బుక్ పెన్ ఒక దగ్గరే పెడతానని చెప్పుకొచ్చింది.
ఇక అరియానా కారులో హ్యాండ్ వాష్ తప్పనిసరిగా ఉంచుకుంటుందట. అలాగే చిన్న పిల్లోస్ అన్నా కూడా చాలా ఇష్టమని చెప్పింది. సెకండ్ కార్ కొన్నప్పుడు గిఫ్ట్ గా అమరదీప్ ఇచ్చిన పిల్లోని చూపించింది అరియానా. ఏ సందర్భంగా తనకు థ్యాంక్స్ కూడా చెప్పింది. కార్ బ్యాక్ సైడ్ లో బొమ్మలు పెట్టుకోవడం చాలా ఇష్టమట కానీ టైం దొరక్క కొనడంలేదట అరియానా.. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే పెట్టుకుందామని అనుకుంటోంది. ప్రస్తుతానికైతే అలసిపోయినప్పుడు కాసేపు నిద్రపోవటానికి అవసరమైన రెండు పిల్లోస్ ని మాత్రమే కార్లో ఉంచుకుంటున్నానని చెప్పింది.. ఇలా ఎన్నో విషయాలను వాట్స్ ఇన్ మై కార్ అనే వ్లాగ్ లో షేర్ చేసుకుంది అరియానా.