పోసాని బ్రోకర్ పాటలు విడుదల
on Apr 5, 2014

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "బ్రోకర్ 2". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది. తొలి సీడీని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ స్వీకరించారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో, సమాజంలో మనం ప్రతిరోజు ఏవైతే చూస్తున్నామో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ అంటున్నారు. వెంకట్ వర్దినేని సమర్పణలో డైరెక్టర్స్ సినిమా బ్యానర్లో మద్దినేని రమేష్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బాలాజీ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎన్నికలకు ముందే విడుదల చేయాలనీ భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



