జర్నలిస్ట్ అవతారంలో నాగచైతన్య!
on Dec 30, 2021

వైవిద్యానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న యువ కథానాయకుల్లో అక్కినేని నాగచైతన్య ఒకరు. `మజిలీ`, `వెంకిమామ`, `లవ్ స్టోరి` చిత్రాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో కనిపించి వరుస విజయాలు చూసిన చైతూ.. త్వరలో `బంగార్రాజు`, `థ్యాంక్యూ`, `లాల్ సింగ్ చద్ధా` (హిందీ) చిత్రాలతో పలకరించబోతున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తక్కువ గ్యాప్ లోనే తెరపైకి రాబోతున్న ఈ చిత్రత్రయాల్లోనూ డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు నాగచైతన్య.
ఇదిలా ఉంటే.. `మనం`, `థ్యాంక్యూ` చిత్రాల దర్శకుడు విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో నాగచైతన్య ఓ వెబ్ - సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 8 ఎపిసోడ్లతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ హారర్ సిరీస్ లో జర్నలిస్ట్ పాత్రలో దర్శనమివ్వనున్నాడట చైతూ. అభినయానికి ఆస్కారమున్న ఈ పాత్ర.. నాగచైతన్యలోని నటుడ్ని మరో కోణంలో ఆవిష్కరిస్తుందని టాక్. త్వరలోనే చైతూ - విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ వెబ్ - సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. 2022లోనే ఈ సిరీస్ స్ట్రీమ్ కాబోతోందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



