2021 జ్ఞాపకాలుః `మిస్సింగ్` స్టార్ కెప్టెన్స్!
on Dec 30, 2021
.webp)
కరోనా ఎఫెక్ట్ తో సకాలంలో కొన్ని చిత్రాలు విడుదలకు నోచుకోలేకపోయాయి. దీంతో.. పలువురు స్టార్ కెప్టెన్స్ కి 2021 కాస్త `జీరో రిలీజ్ ఇయర్`గా నిలిచింది. ఈ ఏడాది బోయపాటి శ్రీను, సుకుమార్, శేఖర్ కమ్ముల వంటి అగ్ర దర్శకులు తమ సినిమాలతో సత్తా చాటగా.. ఎస్. ఎస్. రాజమౌళి, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సురేందర్ రెడ్డి, పరశురామ్, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి వంటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మాత్రం ఈ క్యాలెండర్ ఇయర్ లో మిస్ అయ్యారు. వీరిలో త్రివిక్రమ్, అనిల్ రావిపూడిని మినహాయిస్తే మిగిలిన అందరు దర్శకులకి కరోనా ఎఫెక్ట్ కారణంగా 2020 కూడా `జీరో రిలీజ్ ఇయర్`నే కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది మాత్రం ఈ అగ్ర దర్శకులందరి కొత్త చిత్రాలు సందడి చేయనున్నాయి. `ఆర్ ఆర్ ఆర్`తో రాజమౌళి, `లైగర్`తో పూరీ జగన్నాథ్, `#SSMB 28`తో త్రివిక్రమ్, `ఆచార్య`తో కొరటాల శివ, `ఏజెంట్`తో సురేందర్ రెడ్డి, `సర్కారు వారి పాట`తో పరశురామ్, `భవదీయుడు భగత్ సింగ్`తో హరీశ్ శంకర్, `ఎఫ్ 3`తో అనిల్ రావిపూడి 2022లో పలకరించబోతున్నారు. మరి.. వచ్చే ఏడాది ఈ అగ్ర దర్శకుల చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



