అందుకే పాదయాత్ర చేశాను!
on Sep 22, 2022

నాగ శౌర్య, షిర్లీ సేఠియా జంటగా అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కృష్ణ వ్రింద విహారి'. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ లో నాగ శౌర్య బ్రాహ్మణ యువకుడిగా అలరించనున్నాడు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన శౌర్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
మా సినిమా 'కృష్ణ వ్రింద విహారి'పై ప్రేక్షకులకు ఆసక్తి, నమ్మకం కలిగించడం కోసం తాను పాదయాత్ర చేశానని అన్నాడు. రాజకీయ నాయకులు వారి గురించి ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఎలాగైతే పాదయాత్ర చేస్తారో, అలాగే తాను తన సినిమా కోసం చేశానని తెలిపాడు. ప్రేక్షకులను నేరుగా కలిసి వారితో మాట్లాడటం, వారి ప్రేమను పొందటం సంతోషం కలిగించిందని చెప్పాడు. కమల్ హాసన్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు వంటి వారు గతంలో బ్రాహ్మణ పాత్రలు పోషించి మెప్పించారని, తాను వాళ్ళతో పోల్చుకోను కానీ ఈ అబ్బాయి బాగా చేశాడు అనుకునేలా మాత్రం చేశానని తెలిపాడు. తన స్నేహితుడు అవసరాల శ్రీనివాస్ దగ్గర బ్రహ్మణ యువకుడి బాడీ ల్యాంగ్వేజ్ గురించి తెలుసుకున్నానని, ఈ సినిమా ఎవరి మనోభావాలు హర్ట్ చేసేలా ఉండదని శౌర్య చెప్పాడు.
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిందని చెప్పి ట్రెండ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయలేదని.. ఎందుకంటే ఇది ఎవర్ గ్రీన్ స్క్రిప్ట్ అని, ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని అన్నాడు. 'అదుర్స్', 'దువ్వాడ జగన్నాథం', 'అంటే సుందరానికీ' చిత్రాలు వేటికదే విభిన్నంగా ఎలా ఉన్నాయో, అలాగే మా చిత్రం కూడా వాటికి భిన్నంగా ఉంటుందని చెప్పాడు. తనకు కేవలం ఇలాంటి పాత్రలే చేయాలనేం లేదని, అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియా గురించి ప్రత్యేకంగా ఆలోచించట్లేదని, ప్రజెంట్ మనం మంచి సినిమా తీస్తే అందరూ ఆదరిస్తున్నారని అన్నాడు. పెళ్లి ఎప్పుడు అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదని, వచ్చాక చెప్తానని శౌర్య చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



