'టైగర్ నాగేశ్వరరావు'గా చేయడానికి బన్నీ, చరణ్.. ఇద్దరూ ఓకే చెప్పారు!
on Sep 22, 2022
.webp)
జూనియర్ ఎన్టీఆర్ తో 'అల్లరి రాముడు' చేసినా, ప్రభాస్ తో 'అడవి రాముడు' తీసినా, అల్లరి నరేష్ ని 'యముడికి మొగుడు'గా మార్చినా, బాలయ్య బాబుని 'కృష్ణబాబు'గా కొత్తగా చూపించినా ఆ క్రెడిట్ అంత సీనియర్ ప్రొడ్యూసర్ చంటి అడ్డాలకే దక్కుతుంది. ప్రస్తుతం రవితేజ హీరోగా వేరే ప్రొడ్యూసర్ నిర్మిస్తోన్న టైగర్ నాగేశ్వరరావు మూవీని నిజానికి ఆయన అల్లు అర్జున్ లేదా రామ్‌చరణ్‌తో నిర్మించాల్సింది. అవును. ఆ మూవీకి సంబంధించి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను తెలుగువన్‌తో ఇంటర్వ్యూలో పంచుకున్నారు చంటి.
"యాక్చ్యువల్ గా టైగర్ నాగేశ్వరావు అనే సబ్జెక్టుని వంశీ రాసుకున్నాడు. ఆ సినిమా కోసం దాదాపు ఆరేడు నెలలు కూర్చుని చాలా మార్పులు చేసాం. వంశీ స్టువర్టుపురం ఊరెళ్ళి అక్కడ టైగర్ నాగేశ్వరరావు భార్య, పిల్లలను కలిసి సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ ని సంపాయించుకున్నాడు. తర్వాత మెగా కాంపౌండ్ లో ఉన్న పెద్ద స్టార్ తో చేద్దామని అనుకున్నాం. అన్నీ ఓకే అయ్యాక ఈ సినిమా కథ ఇండస్ట్రీలోని అందరి స్టార్ ల చేతులు మారేసరికి రెండేళ్లు టైం పట్టేసింది. ఇక ఫైనల్ గా ఈ స్టోరీ రవితేజ చేతికి వచ్చింది. అప్పుడు చిరంజీవి ఈ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ లో "వీడు నా కథను దొబ్బేసాడు..వీడు పెద్ద దొంగ" అంటూ రవితేజ మీద సరదాగా జోక్స్ కూడా వేశారు. అని ఆయన చెప్పారు.
రవితేజతో సినిమా చేద్దామని వంశీ అనేసరికి పెద్ద బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అనే సందేహంతో నేను వదిలేసుకున్నాను. అందుకే హీరో, ప్రొడ్యూసర్స్ చేంజ్ అయ్యారు. ఈ సినిమా కథను రాంచరణ్‌కు చెబితే, అతనికి బాగా నచ్చింది. చిరంజీవి కూడా రెండు సార్లు ఈ కథ విన్నారు. ఆయనకూ నచ్చింది. మరి డైరెక్టర్ కొత్తవాడని వద్దనుకున్నారో కారణమేంటో తెలీదు. అది వర్కవుట్ కాలేదు. నిజానికి అంతకు ముందే బన్నీ దగ్గరకు కూడా ఈ స్టోరీ వెళ్ళింది. ఐతే అప్పుడే పుష్ప మూవీ ఆఫర్ రావడం, దానికి సుకుమార్ డైరెక్టర్ కావడం, అందులోనూ ఆయనది దొంగ క్యారెక్టర్ కావడంతో.. దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు అని షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్ చూస్తున్నారు. కంటెంట్ లేని సినిమాలను అస్సలు చూడడమే మానేశారు. ఈ మూవీ నా చేతిలోంచి పోయిందని కాస్త బాధగానే ఉంది. ఎందుకంటే ఇవ్వాల్టి రోజున ఎంత పెద్ద కథానాయకుడికైనా కథే ముఖ్యం. మంచి కథ దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఈ మూవీ ఇలా చేజారిపోవడం కొంచెం బాధాకరమే" అంటూ చంటి అడ్డాల తన మనసులోని విషయాలను షేర్ చేసుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



