ENGLISH | TELUGU  

'బంగార్రాజు' ఫస్ట్ లుక్.. చైతన్య సర్ ప్రైజ్ ఎంట్రీ!

on Nov 22, 2021

కింగ్ నాగార్జున, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'. 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడదే టైటిల్ తో నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో 'బంగార్రాజు' అనే సినిమా వస్తుంది. ఈ మూవీని జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 'బంగార్రాజు' ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

'బంగార్రాజు'లో అక్కినేని యువ హీరో నాగ చైతన్య, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కృతి పోషిస్తున్న నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్ విడుదలై ఆకట్టుకుంది. ఇక 'బంగార్రాజు' ఫస్ట్ లుక్ ని ఈ నెల 22న, టీజర్ ని చైతన్య పుట్టినరోజు సందర్భంగా 23న విడుదల చేస్తామని రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా 'బంగార్రాజు' ఫస్ట్ లుక్ అంటూ నాగార్జున ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ ను షేర్ చేశారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగార్జునకు బదులుగా నాగ చైతన్య ఉండటం విశేషం. సోగ్గాడే సినిమాలో నాగార్జున మ్యానరిజం మాదిరిగానే, కర్రని నేలపై కొట్టి పైకి ఎగరేసి స్టైల్ గా నడుస్తున్న చైతన్య స్టిల్ ఆకట్టుకుంటోంది.

'బంగార్రాజు'లో నాగార్జున-రమ్యకృష్ణ, చైతన్య-కృతి జంటగా నటిస్తున్నారని ముందు నుంచి తెలిసిందే. అయితే 'బంగార్రాజు' ఫస్ట్ లుక్ అంటూ చైతన్య లుక్ ని రివీల్ చేయడంతో.. ఈ మూవీలో 'బంగార్రాజు' యంగర్ వెర్షన్ రోల్ లో చైతన్య కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే సోగ్గాడేలో బంగార్రాజు పాత్రలో కనిపించిన నాగార్జునకు జోడీగా సత్యభామ పాత్రలో రమ్యకృష్ణ కనిపించింది. కానీ 'బంగార్రాజు' మూవీలో కృతి పోషిస్తున్న పాత్ర పేరు నాగలక్ష్మి అని ఇప్పటికే చెప్పేశారు. దీంతో బంగార్రాజు, సత్యభామల కథలోకి నాగలక్ష్మి ఎలా వచ్చిందన్న ఆసక్తి నెలకొంది. మంగళవారం విడుదలకానున్న టీజర్ తో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.