మోహన్‌లాల్ సరసన మంచు లక్ష్మి!
on Nov 22, 2021

మోహన్‌లాల్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో 'పులిమురుగన్' (2016) ఒకటి. అప్పటికి మలయాళంలోనే హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా నిలిచిన ఆ మూవీని వైశాఖ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరూ కలిసి పనిచేస్తోన్న సినిమా 'మాన్‌స్టర్'. నవంబర్ 10న సెట్స్ మీదకు వెళ్లిన ఆ మూవీ తొలి షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ మూవీలో లక్ష్మీ మంచు ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఈ మూవీలో చేస్తోంది హీరోయిన్ రోల్ అని లేటెస్ట్‌గా మాలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది.
ఫస్ట షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. వాటితో పాటు, "ఇది డిఫరెంట్ ఫీలింగ్ కలిగిస్తోంది. నా కెరీర్‌లోని ఫేవరేట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్‌లలో ఒక షెడ్యూల్ పూర్తయింది. గత నెల నాటి లెర్నింగ్ ఇంకా పూర్తి కాలేదు. అత్యంత ప్రతిష్ఠాత్మక నటుల్లో ఒకరి సరసన ఒక కొత్త భాష, ఒక కొత్త సామర్థ్యం. ఆహ్! వాట్ ఎ మంత్. ఇన్‌క్రెడిబుల్ యాక్టర్ల గ్రేట్ టీమ్ ఫిల్మ్ మేకింగ్‌ను చాలా ఫన్‌గా మార్చేసింది! కమింగ్ సూన్ @mohanlal @antonyperumbavoor @directorvysakh @thesudevnair @honeyroseinsta @krishnauday #Monster #ScheduleWrap #ActorsLife,” అంటూ రాసుకొచ్చారు.

'పులిమురుగన్'కు స్క్రిప్ట్ అందించిన ఉదయ్ కృష్ణ, 'మాన్‌స్టర్'కూ పనిచేస్తున్నాడు. హీరో లక్కీ సింగ్ పాత్రలో మోహన్‌లాల్ కనిపించనున్నారు. ఇదివరకే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో ఆయన చేతిలో గన్ పట్టుకొని వున్న సిక్కుగా కనిపిస్తున్నారు. లక్ష్మీ మంచుకు ఇదే తొలి మలయాళం మూవీ. ఇందులో హనీ రోజ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



