'బోడి బాలరాజు'గా నాగ చైతన్య!
on Jul 30, 2022

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషిస్తున్న 'లాల్ సింగ్ చడ్డా' సినిమాతో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. చైతన్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండటం విశేషం. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో తాజాగా చైతన్య పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది.
.webp)
ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ లోని బోడిపాలెం అనే చిన్న టౌన్ నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా కనిపిస్తానని మేకింగ్ వీడియోలో చైతన్య తెలిపాడు. ఈ పాత్ర కోసం మొదట రకరకాల పేర్లు పరిశీలించి, చివరికి 'బోడి బాలరాజు' ఫిక్స్ చేశామని అన్నాడు. 'బాలరాజు' పేరుతో అప్పట్లో తాతగారు(ఏఎన్నార్) సినిమా చేశారని గుర్తు చేసుకున్నాడు. మేకింగ్ వీడియోలో చైతన్య విభిన్న గెటప్స్ లో కనిపించడం విశేషం. అలాగే టీమ్ సభ్యులంతా చైతన్యను ప్రశంసించారు. చాలా కూల్ అండ్ హంబుల్ పర్సన్ అని.. ఎలాంటి ఇబ్బంది పడకుండా హిందీ డైలాగ్స్ చెప్పాడని, మంచి ఆర్టిస్ట్ అని కొనియాడారు. చైతన్య సైతం ఈ సినిమా తన మనసుకి బాగా దగ్గరైందని చెప్పాడు.

హాలీవుడ్ మూవీ 'పారెస్ట్ గంప్'కి రీమేక్ గా 'లాల్ సింగ్ చడ్డా' మూవీ తెరకెక్కింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయ్ కామ్18 స్టూడియోస్ బ్యానర్లపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అందారే, రాధికా చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ఆమిర్ సరసన కరీనా కపూర్ నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



