'పవర్ స్టార్' బర్త్ డేకి 'ఫస్ట్ డే ఫస్ట్ షో'
on Jul 30, 2022

'జాతిరత్నాలు' సినిమాతో కడుపుబ్బా నవ్వించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కేవీ అనుదీప్ తన తదుపరి సినిమా 'ప్రిన్స్'ను కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే రచయితగానూ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు అనుదీప్. అదే 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. అనుదీప్ స్టొరీ అందించిన ఈ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్ కానుంది.
.webp)
'జాతిరత్నాలు' సినిమాకి డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పనిచేసిన వంశీ, లక్ష్మీనారాయణ 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చిత్రానికి దర్శకత్వం వహించారు. పూర్ణోదయ పిక్చర్స్, శ్రీజ ఎంటర్టైన్మెంట్స్, మిత్రవింద మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఇది పవన్ క్లాసిక్ హిట్ 'ఖుషి'(2001) సినిమా చుట్టూ తిరిగే కథ అని టీజర్ ని బట్టి అర్థమైంది. టీజర్ లో హీరోయిన్ 'నాకు ఖుషి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కావాలి' అని అడగటంతో.. ఆ టికెట్ తీసుకురావడం కోసం హీరో పడే అవస్థలను సరదాగా, ఆసక్తికరంగా చూపించారు. 'ఖుషి' టైంలో థియేటర్స్ దగ్గర సందడి ఎలా ఉండేది, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత కష్టపడేవారు కూడా టీజర్ లో చూపించారు. ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

టీజర్ తో పవన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ టీమ్ తాజాగా రిలీజ్ డేట్ తో సర్ ప్రైజ్ చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. 'ఖుషి' సినిమా చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన సినిమా.. పవన్ బర్త్ డేకి రిలీజ్ కావడం అనేది ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



