ఆగస్టు నుండి నాగచైతన్య కూడా...
on Jul 8, 2020
.jpg)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. సాయి పల్లవి హీరోయిన్. జస్ట్ 15 డేస్ షూటింగ్ బ్యాలన్స్ ఉంది. యాక్చువల్లీ... 2020 సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా రిలీజ్‌కి రెడ్ సిగ్నల్ వేసింది. షూటింగ్స్ స్టార్ట్ అయిన తరవాత 15 డేస్ వర్క్ కంప్లీట్ చేస్తే రిలీజ్ గురించి ఆలోచించవచ్చు.
ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ, అక్కినేని నాగచైతన్య మాత్రం రెడీ అని శేఖర్ కమ్ములకు చెప్పాడట. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలతో షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ, జూలైలో షూటింగ్ స్టార్ట్ చేయాలని 'లవ్ స్టోరీ' యూనిట్ అనుకుంది. అయితే, జూలైలో కాకుండా ఆగస్టు నుండి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.
ఆగస్టులో గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వం వహించనున్న 'అలిమేలు మంగ వెంకటరమణ' షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య 'లవ్ స్టోరీ' చేయాలని అనుకుంటున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆగస్టులో మరికొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యేలా ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



