నరేష్ ప్యానెల్‌కే నా సపోర్ట్-నాగబాబు
on Mar 9, 2019
`మా` ప్రెసిడెంట్ శివాజీరాజా రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో మరోసారి `మా` ఎన్నికలు జరపనున్నారు. ఈ నెల 10న జరగనున్న ఈ ఎలక్షన్స్ పై ఇప్పటికే అందరిలో ఆసక్తి మొదలైంది. గతంలో `మా` సీటు కోసం రాజేంద్రప్రసాద్, జయసుధలు ఎలాగైతే ఫైట్ చేసారో ఈ సారి కూడా అలాంటి వాడి వేడి శివాజీరాజా, నరేష్ మధ్య నెలకొంది. ఇక ఈసారి శివాజీ రాజాకు , నరేష్ , జీవిత రాజశేఖరలతో కలిసి గట్టి పోటీ ఇవ్వనున్నాడు. ఇక ఇటీవల నాగబాబు నా సపోర్ట్ `నరేష్` ప్యానెల్ కే అంటూ శివాజీ రాజా పై సంచలన కామెంట్స్ చేశాడు. `` నేను గతంలో మా ప్రెసిడెంట్ గా చేసినప్పుడు కూడా మళ్లీ నన్ను చేయమన్నారు కానీ నేను ఒప్పుకోలేదు. ఒక్కరే కాకుండా మారుతూ ఉంటూనే అభివృద్ది పెరుగుతుంది. కాబట్టి ఈ సారి నరేష్ ప్యానెల్ కి అవకాశం ఇచ్చి చూద్దాం. శివాజీ రాజా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు `మా` గురించి మాట్లాడుతుంటే వారి పై చర్చలు తీసుకోగ పోగా కనీసం స్పందించలేదు ..అది నాకు నచ్చలేదు`` అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. చూద్దాం ఈ సారి `మా` సీటు ఎవర్ని వరిస్తుందో.