Home

»

Latest News

అహో అనిపంచేలా `సాహో` రైట్స్!!

Mar 9, 2019 2:01PM

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్  చేస్తోన్న భారీ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `సాహో`. సుజిత్ ఈ చిత్రాన్ని హైటెక్నిక‌ల్ వాల్యూస్ తో హావీవుడ్ స్టాండెర్డ్స్ లో తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన షేడ్స్ ఆఫ్ సాహో 1,2 ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈ చిత్రంలోని ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం దాదాపు 100 కోట్లు ఖ‌ర్చుపెట్టి దుబాయ్ లోని అబుదాబిలో షూట్ చేసారంటే అర్థం చేసుకోవ‌చ్చు ఈ సినిమాను ఏ స్థాయిలో తెర‌కెక్కుతున్న‌దో.  ఇక ఈ సినిమాలో వ‌చ్చే ఇంట్ర‌వెల్ సీక్వెన్స్ ని 35 కోట్లు ఖ‌ర్చు పెట్టి చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఓవ‌ర్సీస్ రైట్స్ 45 కోట్లు ప‌లికిన‌ట్లు తెలుస్తోంది. ఒక్క ఓవర్సీస్ లోనే ఇంత భారీగా అమ్ముడుపోతే మిగ‌తా చోట్ల ఇంకెంత ప‌ల‌క‌నుందో అర్థంచేసుకోవ‌చ్చు.  దాదాపు ఈ సినిమా 300 కోట్ల బ‌డ్జెట్ తో తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది.  యువి క్రియేష‌న్స్ సంస్థ  ఈచిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోంది.  ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి శ్ర‌ధ్దాక‌పూర్ న‌టిస్తోంది.  ఈ చిత్రాన్ని ఆగ‌స్టులో రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com