యూట్యూబ్ లో సూపర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. కిల్లర్ రివ్యూ!
on May 11, 2024
ప్రతీవారం లాగే ఈ వారం ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ఒకటి. ఆయితే దీనిని మించే ట్విస్ట్ లతో మరోవైపు యూట్యూబ్ లో ఉంది. అదే తమిళ్ నుంటి తెలుగులోకి అనవదించబడిన ' కిల్లర్ ' మూవీ ఒకటి. రిలీజైన సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సూపర్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఏదని చూస్తే.. అన్ని సినిమాలతో పాటుగా ఈ సినిమా ఒకటిగా కన్పిస్తుంది. మరి అంతగా ఈ సినిమాలో ఏముంది? ఈ సినిమా ఎందుకు చూడాలో ఓ లుక్కేద్దాం.
అర్జున్, విజయ్ ఆంటోనీ, అషిమా నర్వాల్ ప్రధానపాత్రల్లో నటించిన మూవీ ' కిల్లర్'. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా కథేంటంటే.. అర్థరాత్రి సమయంలో ఈ అపార్ట్మెంట్ లో ఒకావిడని 'కిల్లర్' వెంబడించి దారుణంగా గొంతుకోసి చంపేస్తాడు. ఆ తర్వాత ఎస్పీకి ఫోన్ కాల్ వస్తుంది. సర్ ప్రభాకర్(ఆంటోని) తనే నేరం చేసినట్టు చెప్పి లొంగిపోయాడని ఓ స్టేషన్ కానిస్టేబుల్ ఎస్సీ కి ఫోన్ లో చెప్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన ఎస్పీ కార్తికేయ(అర్జున్) క్రైమ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెడతాడు. ఓ పాతబడ్డ ఫ్యాక్టరీ బయట ఓ వ్యక్తిని దారుణంగా చంపేసి, పెట్రోల్ పోసి కాల్చేయగా అది పోలీసులకి పెద్ద సమస్యగా మారుతుంది. ఐడెంటిఫికేషన్ లో ఏ క్లూలు ఉండవు. అయితే అదేసమయంలో వారికి ఒంటరిగా ఉంటున్న అమ్మాకూతుళ్ళ మీద అనుమానం కలుగుతుంది. అసలు ఆ అమ్మాకూతుళ్ళకి ఆ కాల్చబడిన వ్యక్తికి సంబంధమేంటి? అసలు ప్రభాకర్ ఎవరు? ఈ క్లూ లభించని కేసులో కార్తికేయ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగిందనేది మిగతా కథ.
ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకానొక దశలో హీరోనే విలనా అనే అనుమానం కలుగుతుంది. కానీ అసలు కిల్లర్ అతను కాదని, ఇంకెవరో ఉన్నారనే క్యూరియాసిటి బాగుంటుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారికి ఈ సినిమా ఓ ఫీస్ట్ అని చెప్పాలి. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ సూపర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని ఓసారి చూసేయ్యండి.