నాగ చైతన్య 'లవ్ స్టోరి' బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్!
on Dec 23, 2021

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరి'. సెకండ్ లాక్ డౌన్ తర్వాత సెప్టెంబర్ 24 న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా బుల్లితెరపై కూడా రికార్డు టీఆర్పీతో లవ్ స్టోరి సంచలనం సృష్టించింది.
థియేటర్స్ లో 'లవ్ స్టోరి'కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభకి, సాయి పల్లవి చైతన్యల నటనకి మంచి మార్కులు పడ్డాయి. సాంగ్స్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ లో ఈ సినిమాని సూపర్ హిట్ చేశారు. ఇక ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డిసెంబర్ 12 న స్టార్ మాలో ప్రసారం కాగా.. 18.01 టీఆర్పీ రాబట్టి బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతం అందించాడు. సారంగ దరియా, నీ చిత్రం చూసి వంటి సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



