`శ్యామ్ సింగ రాయ్`తో కొనసాగిస్తారా!
on Dec 23, 2021

నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటించిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు నాని. అందులో ఒకటి 1970ల కాలంలో సాగే బెంగాలీ యువకుడు శ్యామ్ సింగ రాయ్ పాత్ర కాగా.. మరొకటి వర్తమానంలో సాగే తెలుగు కుర్రాడు వాసు పాత్ర.
ఇదిలా ఉంటే.. `శ్యామ్ సింగ రాయ్`లో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నాయికలుగా నటించారు. ముగ్గురివి కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే కావడం విశేషం. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ ముగ్గురు కూడా తమ తమ ప్రీవియస్ తెలుగు మూవీస్ తో మంచి విజయాలు చూశారు. `లవ్ స్టోరి` వంటి ఘనవిజయం తరువాత సాయిపల్లవి, `ఉప్పెన` వంటి సంచలన చిత్రం తరువాత కృతి శెట్టి, `ప్రేమమ్` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత మడోన్నా నటించిన తెలుగు చిత్రం `శ్యామ్ సింగ రాయ్`నే. మరి.. గత తెలుగు చిత్రాలతో విజయాలు చూసిన సాయిపల్లవి, కృతి, మడోన్నా.. `శ్యామ్ సింగ రాయ్`తోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
కాగా, రేపు (డిసెంబర్ 24) `శ్యామ్ సింగ రాయ్` థియేటర్స్ లోకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



