రవితేజ ‘ధమాకా’కి టార్గెట్ ఫిక్స్!
on Dec 22, 2022
మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా ఈనెల 23న అంటే రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. హీరోయిన్ గా శ్రీ లీలా నటించింది. ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రాక్ చిత్రం తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. క్రాక్ తర్వాత చేసిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు తీవ్ర నష్టాలను కలిగించాయి. అయినప్పటికీ రవితేజ మార్కెట్ మాత్రం పెద్దగా తగ్గలేదు. కొంచెం ధమాకా సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ధమాకా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలలోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి రేటే పలికింది.
నైజాంలో 5.5 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా సీడెడ్ లో 2.5 కోట్లు, ఏపీలో 8 కోట్లు బిజినెస్ చేసింది. అంటే మొత్తంగా ఆంధ్ర, తెలంగాణలో కలిపి 16 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక రవితేజ ధమాకా సినిమా కర్ణాటకలో కూడా డీసెంట్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. మిగతా రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలుపుకొని మొత్తం 2.30 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ 18.30 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం.
రవితేజ సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సొంతం అవుతాయి. దాంతో 18.30 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి ధమాకా మూవీ కి 19 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. రవితేజ గత ఐదు చిత్రాలు చూసుకుంటే వరల్డ్ వైడ్ బిజినెస్ డిస్కో రాజాకు 19.2 కోట్లు, క్రాక్ 17 కోట్లు కిలాడీ 22 కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ 17.2 బిజినెస్ చేశాయి. ధమాకా 18.30 కోట్లతో బాక్సాఫీస్ యుద్ధానికి రెడీ అవుతోంది. క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ లతోపాటు సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు దాదాపు ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం కంటెంట్ ఎలా ఉండనుంది? అనే దానిపైనే బ్రేక్ ఈవెన్‌తో పాటు లాభనష్టాలు ఆధారపడి ఉన్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
