ఆ టైమ్‌లో ఆ హీరోయిన్లే నన్ను కాపాడారు!
on Nov 2, 2022
.webp)
సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో. ఆయన తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. దీని కారణంగా ఆయన జైల్లో కూడా ఉన్నారు. ఈ కేసులో ఆయన్ని అక్రమంగా ఇరికించినట్లు తేలేసరికి తర్వాత నిర్ధోషిగా ఆయన బయటికి వచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ లో ఏ హీరో కూడా తనకు పెద్దగా హెల్ప్ చేయలేదని చెప్పారు. ఏ ప్రొడ్యూసర్ ని కూడా తాను ఇబ్బంది పెట్టలేదన్నారు.
తన మీద తప్పుడు అభియోగం నమోదైనప్పుడు ముగ్గురు హీరోయిన్లు సుమలత, సుహాసని, భాను ప్రియ తన వైపు నిలబడినట్లు చెప్పారు. "సుమన్ చాలా మంచివ్యక్తి.. క్రమశిక్షణతో ఉండేవాడు.. అతని బ్యాడ్ టైమ్ వల్ల ఇలా జరిగింది" అని స్టేట్ మెంట్ ఇవ్వడం వలన తనకు మంచి జరిగిందని చెప్పారు. "అప్పట్లో శోభన్ బాబు కూతురు మృదుల మా అమ్మ స్టూడెంట్.. ఆమె ఎన్నో సందర్భాల్లో మా ఇంటికి స్పెషల్ క్లాసెస్ కోసం మా అమ్మ దగ్గరకు వచ్చేవారు. ఆ టైములో ఇండస్ట్రీలోకి ఎంట్రీ రాలేదు. తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాక ఆ పలుకుబడిని అస్సలు వాడుకోలేదు. శోభన్ బాబుతో 'దోషి-నిర్దోషి' మూవీలో నటించాను" అని చెప్పారు..
"అలాగే హీరో కృష్ణ కూతురు కూడా మా అమ్మ కాలేజిలోనే చదువుకున్నారు. ఇక కృష్ణం రాజు అయితే నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. ఏ ఫంక్షన్ అయినా ప్రత్యేకంగా పిలిచేవారు. నా సొంత కష్టంతోనే ఇండస్ట్రీలో పేరు, అవకాశాలు తెచ్చుకున్నాను" అని చెప్పారు సుమన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



