"అత్తారింటికి..." మద్దతుగా ధనుష్
on Sep 25, 2013
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రాన్ని విడుదలకు ముందే లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన క్షణం నుండి టాలీవుడ్ మొత్తం ఏకమై పవన్ సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎక్కడ కూడా పైరసీ చేయకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ పైరసీ విషయం తెలుసుకున్న తమిళ నటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ కూడా "అత్తారింటికి దారేది" చిత్రానికి తన మద్దతు ఇచ్చాడు. అభిమానులందరూ తమ ఐక్యతను చూపించే సమయం వచ్చింది. ఎక్కడ కూడా పైరసీ కాకుండా చూడండి. అందరూ కూడా థియేటర్ కి వెళ్లి ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి. నేను కూడా థియేటర్ లోనే చూస్తానని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



