మైత్రీతో ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్!?
on Feb 5, 2022

కథానాయకుడిగా 20 ఏళ్ళ తన సినీ ప్రయాణంలో.. ఒకే నిర్మాతతో రెండు లేదా అంతకుమించి సినిమాలు చేసిన సందర్భాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. అయితే, ఒకే నిర్మాణ సంస్థలో తన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసిన వైనమైతే లేదనే చెప్పాలి. త్వరలోనే ఆ ముచ్చట తీరనుందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. తారక్ తో `జనతా గ్యారేజ్` వంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ జట్టుకట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమాని అధికారికంగా ప్రకటించింది మైత్రీ. అంతేకాదు.. `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలోనూ తారక్ తో ఓ స్పోర్ట్స్ డ్రామా ప్లాన్ చేస్తోందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తొలుత బుచ్చిబాబు, ఆపై ప్రశాంత్ కాంబోలో మైత్రీ వారి ప్రాజెక్ట్స్ ఉంటాయన్నది ఇన్ సైడ్ టాక్. మరి.. మైత్రీతో తారక్ చేయబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి. త్వరలోనే తారక్- బుచ్చిబాబు - మైత్రీ కాంబో మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు.
కాగా, ఎన్టీఆర్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. ఈలోపే కొరటాల శివ కాంబోలో ఓ సినిమాని పట్టాలెక్కించనున్నారు తారక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



