అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. రాములమ్మతో నందమూరి హీరో!
on Mar 8, 2025
నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. #NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. అశోక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాకి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఇటీవల న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ని నిజం చేస్తూ తాజాగా మేకర్స్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. (Arjun S/O Vyjayanthi)
ప్రచారం జరిగినట్లుగానే #NKR21 కి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా టైటిల్ ను రివీల్ చేస్తూ, పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. పోస్టర్ లో పవర్ ఫుల్ ఐపీఎస్ గా విజయశాంతి కనిపిస్తుండగా, ఆమె కొడుకుగా మాస్ లుక్ లో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు.
తల్లీకొడుకుల కథలో తెరకెక్కుతోన్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో.. వైజయంతిగా విజయశాంతి, అర్జున్ గా కళ్యాణ్ రామ్ అలరించనున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అవుట్ పుట్ అదిరిపోయేలా వస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా కళ్యాణ్ రామ్-విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
