'కన్నప్ప' కంటే ముందే 'ఢీ' కొడుతున్న మంచు విష్ణు!
on Mar 8, 2025

మంచు విష్ణు కెరీర్ లో 'ఢీ' సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదలై.. థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించి, ఘన విజయం సాధించింది. బ్రహ్మానందం, సునీల్ తో కలిసి విష్ణు చేసిన కామెడీని అంత తేలికగా మరచిపోలేము. టాలీవుడ్ లో ఎవర్గ్రీన్ ఎంటర్టైనర్స్ లో ఒకటిగా 'ఢీ' సినిమాకి పేరుంది. ఈ మూవీని ఇప్పటికీ రిపీటెడ్ గా చూసే ఆడియన్స్ ఎందరో ఉన్నారు. సోషల్ మీడియాలోనూ మీమ్స్ రూపంలో ఈ కామెడీ సీన్స్ అలరిస్తుంటాయి. అంతలా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈ కామెడీ ఫిల్మ్.. మరోసారి థియేటర్లలో అలరించనుంది. (Manchu Vishnu)
టాలీవుడ్ లో కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయ్యి.. మంచి వసూళ్లతో సత్తా చాటాయి. ఇప్పుడదే బాటలో పయనించడానికి 'ఢీ' సిద్ధమవుతోంది. ఈ మూవీ మార్చి 28న రీ రిలీజ్ కానుంది. అయితే అదే తేదీకి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలు విడుదలవుతున్నాయి. మరి వాటి నడుమ రీ రిలీజ్ అవుతున్న 'ఢీ' ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. (Dhee Re Release)
మరోవైపు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న 'కన్నప్ప' ఏప్రిల్ 25న విడుదలవుతోంది. ఆ సినిమాకి కరెక్ట్ గా నాలుగు వారాల ముందు 'ఢీ' రీ రిలీజ్ అవుతుండటం విశేషం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



