ది స్మైల్ మాన్ మూవీ రివ్యూ
on Mar 8, 2025
నటీనటులు: శరత్ కుమార్, కలైయరసన్, శ్రీ కుమార్, సిజా రోజ్, సురేష్ మీనన్, ఇనయా తదితరులు
ఎడిటింగ్: లోకేష్
మ్యూజిక్: గవాస్కర్ అవినాష్
సినిమాటోగ్రఫీ: విక్రమ్ మోహన్
నిర్మాతలు: శలిల్ దాస్, అనీష్ హరిదాసన్, ఆనందన్ టి
దర్శకత్వం: శ్యామ్ ప్రవీణ్
ఓటీటీ: ఆహా
కథ:
సిటీలో చిదంబరం (శరత్ కుమార్) సీఐడీ సీనియర్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న చిదంబరం ఐదేళ్ల క్రితం సైకో కిల్లర్ అయినటువంటి 'స్మైల్ మాన్' ను పట్టుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడతాడు. ఆ సమయంలోనే ఆఫీసర్ వెంకటేశ్ (సురేశ్ మీనన్) చేతిలో 'స్మైల్ మాన్' చనిపోయాడనే వార్తలు వస్తాయి. అయితే అప్పటి నుంచి ఆఫీసర్ వెంకటేశ్ జాడ తెలియకుండా పోతుంది. ఏదేమైనా స్మైల్ మాన్ పీడ విరగడ అయిందని అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఐదేళ్ల క్రితం గాయపడిన చిదంబరం నిదానంగా కోలుకుంటాడు. అయితే అతను అల్జీమర్స్ బారినపడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతారు. ఒక ఏడాదిలో అతను తన గతం గురించి పూర్తిగా మరిచిపోయే అవకాశం ఉందని అంటారు. స్మైల్ మాన్ చనిపోలేదని అతను చెప్పడంతో పోలీస్ అధికారులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఆ వార్త బయటికి వచ్చిన మరుసటి రోజు నుంచే, స్మైల్ మాన్ హత్యలు చేయడం మొదలవుతుంది. స్మైల్ మాన్ ఎవరు? అతను హత్యలు ఎందుకు చేస్తున్నాడు? చిదంబరం ఎలా అతన్ని పట్టుకున్నాడనేది మిగతా కథ.
విశ్లేషణ:
సైకో కిల్లర్ కథలకి ప్రధానమైనవి రెండే రెండు.. ఒకటి హత్యల ప్రాట్రన్ తో పాటు అతని బలమైన ఫ్లాష్ బ్యాక్, రెండోది ఆ సైకోని పట్టుకోవడానికి పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్.. ఇవి రెండు బలంగా ప్రెజెంట్ చేయగలిగితే అది హిట్టు బొమ్మ.. మరి ఈ స్మైల్ మాన్ ఆ ఇంపాక్ట్ చేయగలిగిందా అంటే లేదనే చెప్పాలి. కథ కొంతవరకు ఇంటెన్స్ గా సాగినా దానిని చివరి వరకు కొనసాగించలేకపోయాడు దర్శకుడు.
సిటీలో వరుసగా హత్యలు జరుగుతున్నప్పుడు ఆ స్మైల్ మాన్ ఎవరా అనేది ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచుతాయి. సైకో కిల్లర్ ను రివీల్ చేసేవరకూ ఫస్టాఫ్ గా నడుస్తుంది. అతనిని రివీల్ చేసిన తరువాత చోటు చేసుకునే సంఘటనలతో సెకండాఫ్ కొనసాగుతుంది.
సెకెంఢాఫ్ చూసాక ప్రతీ ఒక్కరికి ఒక్కటి మాత్రం అనిపిస్తుంది. అదేంటంటే.. " ఇది సీరియల్ కిల్లర్ కాదు ఆడియన్స్ కిల్లర్" సినిమా అని అనిపిస్తుంది. ఎందుకంటే సెకంఢాఫ్ చాలా స్లోగా సాగుతుంది. ఎంతలా అంటే చాలా ల్యాగ్ సీన్లు ఉంటాయి. సింపుల్ గా ఫినిష్ చేయాల్సిన పాయింట్ ను లాగి లాగి ఆడియన్ కి విసుగుతెప్పించారు. సినిమా మొత్తంలో స్మైల్ మాన్ కోసం వెతికే సీన్లు, పోలీస్ అప్రోచ్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ భిన్నంగా ఉండటం కాస్త ప్లస్. ఫస్టాఫ్ పర్వాలేదనపించినా సెకంఢాఫ్ చూస్తే మంచి కథని ఎందుకు ఎక్కడెక్కడికో లాక్కెళ్తున్నారు అన్నట్టుగా అడ్డదిడ్డంగా సాగుతుంది.
ఇక ఫస్టాఫ్ లో ఉన్న క్యారెక్టర్లు సరిపోవు అన్నట్టుగా ద్వితీయార్థంలో మరికొన్ని క్యారెక్టర్లు వస్తుంటాయి. సైకో కిల్లర్ చేసే హత్యల ప్యాట్రన్ బట్టి చేసే ఇన్వెస్టిగేషన్ బాగున్నప్పటికి ఆ పాయింట్ ని వదిలేసి స్మైల్ మేన్ గతం తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించారు మేకర్స్. దాంతో అసలు పాయింట్ పక్కకి వెళ్ళి కథపై ఇంటెన్స్ మిస్ అయ్యింది. పైగా శరత్ కుమర్ కి అల్జీమర్స్.. అదీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
ఈ సినిమాలో హత్యలు దారుణంగా జరుగుతుంటాయి. దంతాలన్నీ కనిపించేలా నోరు భాగమంతా కోసేసిన శవాలను ఒకదాని తర్వాత ఒకటిగా చూడటం సాధారణ ప్రేక్షకుల వలన అయ్యేపని కాదు. హత్యలు జరిగే పద్ధతి తప్ప, మిగతా అంశాలన్నీ కూడా రొటీన్ గానే అనిపిస్తుంటాయి. అడల్ట్ సీన్లు ఏమీ లేవు. గవాస్కర్ అవినాశ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. లోకేశ్ ఎడిటింగ్ ఓకే. విక్రమ్ మోహన్ ఫొటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా : కొన్ని ఎంగేజింగ్ సీన్ల కోసం ఒక్కసారి చూడొచ్చు. థ్రిల్లర్ లవర్స్ కి నచ్చొచ్చు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
