'NBK 107' టీజర్.. బోయపాటిని మించిన మాస్
on Jun 9, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. బాలయ్యను కరెక్ట్ గా చూపించాలంటే బోయపాటే అనే అభిప్రాయం ప్రస్తుతం ఫ్యాన్స్ లో ఉంది. బాలయ్య లుక్స్, బాడీ ల్యాంగ్వేజ్ విషయంలో బోయపాటి స్పెషల్ కేర్ తీసుకుంటాడు. ఇప్పుడు మరో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా ఆ లిస్టులో చేరిపోయాడు.
గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య తన 107వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు(జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. 'NBK107 First Hunt' పేరుతో తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ షర్ట్, లుంగీ ధరించి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య ఆకట్టుకుంటున్నాడు. బోయపాటి సినిమాల రేంజ్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ టీజర్ లో ఉన్నాయి. మొత్తానికి బాలయ్య పాలిట మరో బోయపాటిలా గోపీచంద్ కనిపిస్తున్నాడు. సినిమా రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో 'అఖండ' విజయంలో కీలక పాత్ర పోషించిన థమన్.. 'NBK 107' టీజర్ లోనూ తన మ్యూజిక్ తో అదరగొట్టాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



