'చోర్ బజార్' ట్రైలర్ రిలీజ్ చేసిన బాలయ్య
on Jun 9, 2022

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా 'జార్జ్ రెడ్డి' ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'చోర్ బజార్'. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వీఎస్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో గెహన సిప్పీ హీరోయిన్. తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
'చోర్ బజార్' మూవీ ట్రైలర్ నటసింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈరోజు విడుదలైంది. 'NBK107' షూట్ లొకేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది. తన తండ్రి పూరి డైరెక్ట్ చేసిన 'మెహబూబా', కథ అందించిన 'రొమాంటిక్' సినిమాలతో హీరోగా విజయాన్ని అందుకోలేకపోయిన ఆకాష్.. ఈ సినిమా పట్ల నమ్మకంగా ఉన్నాడు. అందుకు తగ్గట్లే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఒక డైమండ్ చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. 'చోర్ బజార్'లో ఉండే యువకుడిగా ఆకాష్ అలరిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. మరి ఈ సినిమా అయినా ఆకాష్ కి హీరోగా సాలిడ్ హిట్ ఇస్తుందేమో చూడాలి.

సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా జగదీష్ చీకటి, ఎడిటర్ గా అన్వర్ అలీ వర్క్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



