'ఆచార్య' కథ తేలింది! 'పుష్ప' సంగతేంటి?
on Aug 28, 2020

'ఆచార్య' చిత్రకథ పై కాపీ ఆరోపణలు వచ్చిన కొద్ది గంటల్లోనే కొరటాల శివ మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. తన కథను తీసుకున్నారని ఆరోపించిన రాజేష్ మండూరితో ఎన్టీవీ లైవ్ చూస్తున్న ప్రేక్షకుల ముందే ఫోన్లో మాట్లాడాడు. వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. ఒక విధంగా వివాదాన్ని ముగించేశాడు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని రాజేష్ మండూరి సూచించడంతో పాటు తనపై ఆరోపణలు చేసినందుకు కోర్టుకు వెళ్తానని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దాంతో లైవ్ లోనే తనది తప్పయితే క్షమాపణలు చెబుతున్నానని రాజేష్ మండూరి చెప్పాడు. 'ఆచార్య' కథ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే! మరి, 'పుష్ప' సంగతేంటి? టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హాట్ టాపిక్ ఇదే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'పుష్ప'. ఎర్రచందనం నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోది లారీ డ్రైవర్ క్యారెక్టర్. ఆల్రెడీ రిలీజైన ఫస్ట్ లుక్ చూస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన హీరో న పోలీసులు పట్టుకున్నట్లు అర్థమవుతుంది. ఇదే నేపథ్యంలో ఓ రచయిత 'తమిళ కూలి' అనే కథ రాశారు. అతను కూడా తన కథను కాపీ చేసి 'పుష్ప' తీస్తున్నట్లు ఆరోపిస్తున్నాడు. 'ఆచార్య' వివాదంలో తమపై విమర్శలు చేసినందుకు వివరణ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, తమ సంస్థలోనే తీస్తున్న సినిమా పై వస్తున్న వివరాలపై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



