ENGLISH | TELUGU  

రియా చక్రవర్తి ఇంటికి వచ్చిన పోలీసులు...

on Aug 27, 2020

ముంబైలోని మీడియాపై రియా చక్రవర్తి మండిపడ్డారు. అంతే కాదు... వాళ్ల పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో తో ఆమె ఇంటికి సమీపంలో గల శాంటాక్రజ్  పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీసు ఆమె ఇంటికి వచ్చాడు. అసలు వివరాల్లోకి వెళితే....

గురువారం ఉదయం మీడియా తీరుపై మండిపడుతూ... తన కుటుంబానికి మీడియా నుంచి రక్షణ కావాలని కోరుతూ సోషల్ మీడియాలో రియా చక్రవర్తి ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో రియా తండ్రి బయటకు వెళ్తుంటే మీడియా చుట్టుముట్టింది.

 "మా బిల్డింగ్ కాంపౌండ్ లో పరిస్థితి ఇది. ఆ వీడియోలో వ్యక్తి మా నాన్న ఇంద్రజిత్ చక్రవర్తి. రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఈడీ, సీబీఐ సహా దర్యాప్తు చేస్తున్న ఇతర అధికారులకు కోపరేట్ చేయడానికి మా ఇంటి నుంచి బయటకు అడుగు పెడుతున్నారు. నా జీవితానికి మా మా కుటుంబంలోని వ్యక్తుల జీవితానికి ముప్పు పొంచి ఉంది. లోకల్ పోలీస్ స్టేషన్ కి ఈ పరిస్థితి వివరించాము. మేము అక్కడికి వెళ్ళినా మాకు ఎటువంటి సహాయం అందించలేదు" అనే రియా చక్రవర్తి పేర్కొన్నారు. మరో వీడియో లో వాచ్ మెన్ ను మీడియా హెరాస్ చేసిందని పేర్కొన్నారు. ఈ పోస్టులు చేసిన వెంటనే ఆమె ఇంటికి పోలీసులు వచ్చారు భద్రత కల్పించారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.