'విశ్వామిత్ర'గా మోహన్ బాబు.. భయం భయంగా ఉంది!
on Aug 1, 2022

తన కూతురు మంచు లక్ష్మి నిర్మిస్తూ నటిస్తున్న 'అగ్ని నక్షత్రం' సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రీకూతుళ్ళు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. తాజాగా ఈ మూవీ నుంచి మోహన్ బాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.
'అగ్ని నక్షత్రం' సినిమాలో ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. తన ఆలోచనలు, భావజాలంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన విశ్వామిత్ర పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారని తెలుపుతూ తాజాగా మంచు లక్ష్మి ఆయన ఫస్ట్ లుక్ ని సోషల్ మీడియాలో పంచుకుంది. విశ్వామిత్రగా మోహన్ బాబు ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తన ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ లో పంచుకున్న మోహన్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "నా కూతురు నిర్మిస్తూ నటిస్తున్న 'అగ్ని నక్షత్రం'లో తనతో మొట్టమొదటిసారి ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నాను. భయం భయంగా ఉంది." అంటూ మోహన్ బాబు రాసుకొచ్చారు. మోహన్ బాబు లాంటి నటుడు తన కూతురితో కలిసి నటించడం భయంగా ఉందని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.

ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మోహన్ బాబుతో మంచు లక్ష్మి నిర్మిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



