కలెక్షన్ కింగ్ యముడి పాత్ర చేయడంట
on Apr 16, 2014
నటుడు మోహన్ బాబు యముడిగా నటిస్తున్న తాజా చిత్రం "యమలీల2". ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ... "యముడి పాత్ర పోషించడం ఓ అదృష్టం. ఈ సినిమా ద్వారా నాకు రెండోసారి ఆ అదృష్టం వచ్చింది. దిని తర్వాత మరోసారి యముడి పాత్ర చేయను. నటుడు అంటే కూలీ తీసుకొని పని చేసేవాడు. దర్శక నిర్మాతలు చెప్పినట్లు నటులు వినాలి. అలా విన్నవాళ్ళు ఎక్కువకాలం పరిశ్రమలో ఉంటారు. లేనివాళ్ళకు జీవితం ఉండదు. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలతో పని చేస్తుంటే బాపు, రమణలతో పనిచేస్తున్న అనుభూతి కలిగింది. చిత్ర కథానాయకుడు సతీష్ మంచి నటుడిగా ఎదుగుతాడు" అని అన్నారు.