గాయత్రి ఎఫెక్ట్: మోహన్‌బాబు రిటైర్‌మెంట్..?
on Feb 24, 2018

శ్రీలక్ష్మీప్రసన్నా పిక్చర్స్.. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి. 40కి పైగా సినిమాలను నిర్మించి ఎంతో ఘనమైన ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకున్న ప్రొడక్షన్ హౌస్. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి.. ఎందరినో వెండితెరపై వెలిగించిన సంస్థ. అయితే ఇక మీదట తెరపై ఈ బ్యానర్ పేరు కనిపించదట. తాను ఇక సినిమాలను నిర్మించనని ప్రకటించారు ఈ సంస్థ అధినేత మోహన్‌బాబు. ఇంతటి కఠినమైన నిర్ణయం వెనుక కారణం లేకపోలేదు..
గతంలో ఎన్నో బ్లాక్‌బస్లర్టను నిర్మించిన మోహన్‌బాబు ఇటీవలి కాలంలో నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గాయత్రి కూడా భారీగా నష్టాలు తీసుకురావడంతో.. చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండటమే మంచిదని భావించి.. నిర్మాతగా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అయితే చివరిశ్వాస వరకు నటుడిగా కొనసాగుతానని చెప్పాడు పెదరాయుడు. ఆయన నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేసింది. మరోసారి ఆలోచించాలని.. నిర్ణయాన్ని మార్చుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోరుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



