'అల్లు స్టూడియోస్'ని ప్రారంభించనున్న మెగాస్టార్ చిరంజీవి
on Sep 29, 2022
గత సంవత్సరం అక్టోబర్ 1న దివంగత తెలుగు నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో 'అల్లు స్టూడియోస్' పేరుతో కొత్త ఫిల్మ్ స్టూడియోను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ప్రకటన రోజున అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, బాబీ అల్లు, అల్లు శిరీష్ హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో నిర్మాణ పనులను ప్రారంభించారు. గండిపేట్‌లో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభం అయ్యాయి. ఇటీవలే అల్లు స్టూడియో నిర్మాణ పని పూర్తయింది. అల్లు స్టూడియోస్‌లో చిత్రీకరణ పనులకు సంబందించిన బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
అల్లు ఫ్యామిలీ ఇచ్చిన మాట ప్రకారం అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించే గ్రాండ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ మరియు అల్లు కుటుంబం మొత్తంతో కలిసి ఈ స్టూడియోను చిరంజీవి ప్రారంభించనున్నారు.
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్-2 షూటింగ్ అల్లు స్టూడియోస్ లోనే జరగనుందని సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
