ఫ్యామిలీతో కలిసి గోల్డెన్ టెంపుల్ ని సందర్శించిన బన్నీ
on Sep 29, 2022

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెద్ద స్టార్ అయినప్పటికీ తన కుటుంబసభ్యులతో గడపటానికి తగినంత సమయం కేటాయిస్తూ ఉంటాడు. ఈరోజు(సెప్టెంబర్ 29) తన భార్య స్నేహ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి గోల్డెన్ టెంపుల్ ని సందర్శించాడు బన్నీ.
భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హతో కలిసి అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్ళాడు బన్నీ. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. సాధారణ భక్తులతో కలిసి క్యూలో నడుస్తూ ఆలయంలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సినిమాల విషయానికొస్తే 'పుష్ప'తో సంచలన విజయాన్ని అందుకున్న బన్నీ 'పుష్ప-2' చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



