నవంబర్ నుంచి `భోళా శంకర్`!
on Oct 18, 2021

తమిళనాట వసూళ్ళ వర్షం కురిపించిన `వేదాళం` (అజిత్) చిత్రం.. తెలుగులో `భోళా శంకర్` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించనున్న ఈ సినిమాలో కేరళకుట్టి కీర్తి సురేశ్ చెల్లెలి పాత్రలో దర్శనమివ్వనుంది. మెహర్ రమేశ్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రామబ్రహ్మం సుంకర ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుండగా.. మెలోడీబ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. ఏకధాటిగా సాగే లాంగ్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. స్వల్ప విరామం తీసుకుని.. ఆపై చకచకా మిగిలిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేస్తారని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, `భోళా శంకర్`లో సరికొత్త మేకోవర్ లో దర్శనమివ్వనున్నారు చిరు. ఇందులో మెగాస్టార్ కి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. 2022 ద్వితీయార్ధంలో `భోళా శంకర్` తెరపైకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



