చిరు చేస్తే ఫ్లాపేనేమో...??
on Sep 10, 2016

రియాలిటీ షోల్లోనే నెంబర్ వన్... కౌన్ బనేగా కరోడ్ పతి. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం బుల్లి తెరపై ఓ పెను సంచలనం. అమితాబ్ స్ఫూర్తితో మిగిలిన భాషల్లోనూ ఈ కార్యక్రమం మొదలైంది. అక్కడా స్టార్ హీరోలే వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. కానీ... అన్ని చోట్లా ఈ షో ఫ్లాప్ అయ్యింది. ఒక్క తెలుగులోనే నాగార్జున చలవతో సూపర్ హిట్ షోగా మారింది. నాగ్ తన వాక్ చాతుర్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించాడు. బిగ్ బి తరవాత ఆ స్థాయిలో హ్యాండిల్ చేసిన హోస్ట్‌గా పేరు దక్కించుకొన్నారు. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడులో నాగ్ శకం ముగిసింది. నాగార్జున స్థానంలో చిరు రాబోతోతున్నాడు. ఇప్పుడు ప్రశ్నలు అడిగేది.. కోట్లు కురిపించేది చిరునే. మెగా స్టార్ రాకతో ఈ పోగ్రాంకి కొత్త కళ వస్తుందనడంతో సందేహం లేదు. వ్యూవర్ షిప్ కూడా అమాంతం పెరగడం ఖాయం.
.jpg)
కానీ... ఈ షోని నడిపించగల సత్తా చిరుకి ఉందా అనేది సందేహమే. ఎందుకంటే చిరు మాటకారి కాదు. చిరు మాటలెప్పుడూ డ్రమెటిక్‌గానే ఉంటాయి. కలుపుగోలు తనం నాగార్జునతో పోలిస్తే చాలా తక్కువ. పైగా టీవీ షో విషయంలో చిరుకి ఎలాంటి అనుభవం లేదు. దాంతో మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ అవుతుందా, లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. అయితే చిరు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తా అని చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాడట. దానికి తోడు భారీ స్థాయిలో కసరత్తులు కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. అంతకు ముందు నాగ్‌కీ టీవీ షోల విషయంలో అనుభవం లేదు. ఒకట్రెండు ఎపిసోడ్ల తరవాత ఆయనా రాటుదేలిపోయాడు కదా? చిరు పరిస్థితి కూడా అంతేనన్నది విశ్లేషకుల మాట. మరి చిరు ఎలాంటి గారడీ చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



