ఎట్టకేలకు స్వీటీ "సెట్" అయ్యింది...
on Sep 10, 2016
.jpg)
అనుష్క..అందం, నటన కలసిన కుందనపు బొమ్మ. పాత్రకు 100శాతం న్యాయం చేసేందుకు ఏం చేసేందుకైనా వెనుకాడని తత్వమే ఆమె కొంప ముంచింది. సైజ్ జీరో సినిమాలో పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగిన జేజేమ్మ తిరిగి తన ఒరిజినల్ షేప్ కోసం నానాతిప్పలు పడుతోంది. దీని ప్రభావం బాహుబలి2పై పడింది. బాహుబలి-1లో తల్లి క్యారెక్టర్ కాబట్టి ఎలా ఉన్నా పట్టించుకోరు కానీ..బాహుబలి-2లో మాత్రం అలా కుదరదు. కుర్ర దేవసేనగా అమరేంద్ర బాహుబలితో కలిసి కొన్ని రోమాంటిక్ సీన్లతో పాటు, పాటల్లోనూ నటించాల్సి ఉండటంతో బరువు భారంగా మారింది. అందుకే బాహుబలి-2 సెట్‌కి వచ్చిన తొలిరోజే అనుష్కను లావు తగ్గమన్నాడట రాజమౌళి. ఆయన సూచన మేరకు స్వీటీ వర్కవుట్ల మీద వర్కవుట్లు చేయడంతో పాటు చివరికి సైకిల్ తొక్కి మరి కొవ్వును కరగించి జక్కన్న ముందు నిలబడింది. రాజమౌళి చేత ఓకే అని చెప్పడంతో..అనుష్క ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో పాటు షూటింగ్‌లో పాల్గొనబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



