'ది వారియర్' థియేట్రికల్ బిజినెస్.. 'ఇస్మార్ట్ శంకర్' కలెక్షన్స్ కంటే ఎక్కువ!
on Jul 12, 2022

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ 'ఇస్మార్ట్ శంకర్'. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంటే పూరి లాంటి స్టార్ డైరెక్టర్ తోడైతే రామ్ రూ.40 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నాడు. అలాంటిది ఇప్పుడు రామ్ కొత్త సినిమా 'ది వారియర్' థియేట్రికల్ బిజినెస్ ఏకంగా రూ.43 పైగా జరగడం సంచలంగా మారింది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో పాటు, రామ్ మొదటిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించడంతో 'ది వారియర్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ల హవా నడుస్తుండటం కూడా 'ది వారియర్' థియేట్రికల్ బిజినెస్ భారీగా జరగడానికి కారణమని చెప్పొచ్చు. నైజాంలో రూ.11 కోట్లు, సీడెడ్ లో రూ.6 కోట్లు, ఆంధ్రాలో రూ.17 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఏకంగా రూ.34 కోట్ల బిజినెస్ చేసిందన్నమాట. ఇక తమిళ వెర్షన్ 5 కోట్లు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ లో 2.10 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.43.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ మూవీ 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది.

రామ్ కెరీర్ లో ఇదే అత్యధిక బిజినెస్ చేసిన చిత్రం. పైగా 'ఇస్మార్ట్ శంకర్' మూవీ కలెక్షన్స్ (40.56 కోట్ల షేర్) కంటే 'ది వారియర్' థియేట్రికల్ బిజినెస్ ఎక్కువగా ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ కి సరిగా రాక, మీడియం రేంజ్ హీరోలు 20 కోట్ల షేర్ రాబట్టడానికే కష్టపడుతున్నారు. అలాంటిది రామ్ మూవీ ఏకంగా 43 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 'కేజీఎఫ్-2', 'విక్రమ్' వంటి యాక్షన్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు.. 'ది వారియర్' ని కూడా హిట్ లిస్టులో చేరుస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



