నాభి అందాలు.. పుచ్చకాయ.. అదరగొడ్తున్న అనసూయ!
on Jul 12, 2022

కమర్షియల్ మూవీస్ కి పెట్టింది పేరు రాఘవేంద్రరావు. ఆయన సమర్పణలో 'వాంటెడ్ పండుగాడ్' మూవీ రాబోతోంది. ఈయన మూవీస్ లో ఇంటరెస్టింగ్ స్టోరీ అనేది ఉంటుంది. ఎన్నో బ్లాక్‌బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారాయన. ఐతే రాఘవేంద్రరావు మూవీస్ లో శృంగార రసం తప్పనిసరిగా ఉంటుంది. హీరోయిన్లను అందంగా ఎలా చూపించాలో ఆయనకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు. హీరోయిన్ల బొడ్డు అందాలను బాగా చూపిస్తారు. ఆయన ప్రతీ మూవీలో ఇలాంటి ఒక పాట తప్పనిసరిగా కనిపిస్తుంది. హీరోయిన్స్ బొడ్డు పై పూలు, పళ్ళు వేస్తూ హైలైట్ చేస్తారు. ఎందుకంటే స్త్రీలో అందంగా కనిపించే భాగం అదే అన్నారాయన ఒక ఇంటర్వ్యూలో.
దర్శకేంద్రుడి డైరెక్షన్ లో చేసిన శ్రీదేవి, రంభ, నగ్మా, రమ్యకృష్ణ, దీప్తి భట్నాగర్ లాంటి వాళ్ళతో ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసారు. "మీరు ఆపిల్, జామకాయ, ద్రాక్ష లాంటి చిన్న చిన్న పళ్ళు వాడేశారు మరి పుచ్చకాయను ఎప్పుడు వాడతారు?" అని ఒక ఇంటర్వ్యూలో అలీ అడిగేసరికి ఆయన నవ్వి ఊరుకున్నారు.
ఐతే ఇప్పుడు ఆయన సమర్పణలో వస్తున్న 'వాంటెడ్ పండుగాడ్' మూవీతో ఆయన కోరిక తీరబోతుందేమో అనిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇందులో అనసూయ పొట్టి బట్టల్లో నడుము చూపిస్తూ చేతిలో పుచ్చకాయ పట్టుకుని మరీ కనిపించింది. ఇక అనసూయ ఇలా కనిపించేసరికి రాఘవేంద్రరావు గారి పుచ్చకాయ కోరిక ఇప్పుడు తీరబోతోంది అన్నట్టుగా తెలుస్తోంది. ఐతే ఈ చిత్రంలో అనసూయ ఉందా.. పుచ్చకాయ కూడా కనిపించబోతోందా.. ఏమో.. తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



