‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ టీజర్ రిలీజ్
on Jul 12, 2022

సూర్య అనే వెబ్ సిరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు "ఏజెంట్ ఆనంద్ సంతోష్" గా కనిపించబోతున్నాడు. ఇక ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని అనిల్ రావిపూడి విడుదల చేసి టీమ్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. యూట్యూబ్ స్టార్ గా పేరుపొందిన షన్ను ఈ వెబ్ సిరీస్ ద్వారా ఓటిటి వేదిక ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ మొదట్లో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ, టిక్ టాక్స్ చేస్తూ ఎదిగిన వ్యక్తి. తర్వాత తన టాలెంట్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ కొత్త కొత్త కంటెంట్ తో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
"ది సాఫ్ట్ వేర్ డెవలపర్ ", "సూర్య" వెబ్ సిరీస్ లతో బెస్ట్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్నాడు. వీటన్నిటితో కలిపి సోషల్ మీడియా స్టార్ అయ్యేసరికి బిగ్ బాస్ హౌస్ నుంచి పిలుపు అందుకుని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ నుంచి వచ్చాక తన పాపులారిటీ చాలా పెరిగింది. ఇక న్యూ వెబ్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ విషయానికి వస్తే ఆహా ఓటిటి వేదిక పై ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది. ఈ సిరీస్ లో పది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతీ వారం ఒక కొత్త ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట. షన్ను క్యారెక్టర్ పేరు ఇందులో సంతోష్ . అతను డిటెక్టివ్ కావడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. సంతోష్ కి ఒక అయోమయం ఫ్రెండ్ కూడా వెంట ఉంటాడు..వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి కేసులు సాల్వ్ చేశారు..ఎలా చేశారు అనే విషయాలు తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



