'గాడ్ ఫాదర్' వర్సెస్ 'జిన్నా'.. మెగాస్టార్ తో మంచు విష్ణు ఢీ!
on Aug 2, 2022
మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే ఆ సమయంలో తమ సినిమాని విడుదల చేయడానికి కుర్ర హీరోలు వెనకడుగు వేస్తుంటారు. కానీ మంచు విష్ణు మాత్రం మెగాస్టార్ తో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఊహించని విధంగా అదే తేదీకి మంచు విష్ణు తన సినిమాని విడుదల చేయడానికి సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది.
మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'జిన్నా'. ఈ సినిమా కోసం సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ వంటి బ్యూటీలతో పాటు బడా టెక్నిషియన్స్ ని రంగంలోకి దింపిన విష్ణు ఈ చిత్రంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకంతోనేనేమో ఏకంగా మెగాస్టార్ మూవీతో తలపడుతున్నాడు. 'జిన్నా'ను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు తాజాగా ట్విట్టర్ వేదికగా హింట్ ఇచ్చాడు విష్ణు. మరి దసరా బరిలో 'గాడ్ ఫాదర్' ఉంటే నిజంగానే 'జిన్నా'తో విష్ణు బాక్సాఫీస్ వార్ కి దిగుతాడో లేక డ్రాప్ అవుతాడో చూడాలి.
Also Read