ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్యకు కారణమదేనా?
on Aug 1, 2022
దివంగత నటుడు నందమూరి తారక రామారావు కూతురు, బాలకృష్ణ సోదరి కంఠమనేని ఉమా మహేశ్వరి కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే మొదట ఆమె అనారోగ్యంతో మరణించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉమా మహేశ్వరి మానసిక ఒత్తిడి కారణంగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మరణ వార్త తెలిసి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు ఆమె ఇంటికి చేరుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఉమా మహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది. ఇంతలోనే ఆమె మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది.
ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె పార్థివదేహాన్ని ఇంట్లోనే సందర్శనకు ఉంచనున్నట్లు సమాచారం. ఆమె మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read