మంచు మనోజ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు
on May 19, 2011
మంచు మనోజ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు. మే 20 వ తేదీ మంచు మనోజ్ కుమార్ జన్మదినం. యన్ టి ఆర్ కంటే కొన్ని గంటలు మాత్రమే ఆలస్యంగా జన్మించాడు మంచు మనోజ్ కుమార్. 'దొంగ- దొంగది" సినిమాతో హీరోగా ప్రవేశం చేసి "శ్రీ, రాజూభాయ్, బిందాస్, వేదం" సినిమాల్లో చక్కని నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్ కుమార్. ప్రస్తుతం అని దర్శకత్వంలో, డి.యస్.రావు నిర్మిస్తున్న "మిస్టర్ నోకియా" సినిమాలో హీరోగా నటిస్తూ, మంచు ఎంటర్ టైన్ మెంట్స్ అనే బ్యానర్ ని తన అక్క మంచు లక్ష్మీ ప్రసన్నతో కలసి పెట్టి ఆ బ్యానర్ పైన "ఊ కొడతారా - ఉలిక్కి పడతారా" అనే సినిమాని నిర్మిస్తున్నాడు మంచు మనోజ్ కుమార్.
.jpg)
"ఊ కొడతారా - ఉలిక్కి పడతారా" సినిమాని హాలీవుడ్ లో విడుదల చేయబోతున్నాడు మనోజ్ కుమార్. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పరిమళింపజేయటానికి ప్రయత్నిస్తున్న మంచు మనోజ్ కుమార్ మరిన్ని మంచి చిత్రాల్లో నటించి, తన తండ్రి పేరు నిలబెట్టాలని తెలుగువన్ ఆశిస్తూ, అతనికి తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



