అల్లు అర్జున్ సినిమాకి తమన్ సంగీతం
on May 19, 2011
అల్లు అర్జున్ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, వాసూవర్మ దర్శకత్వంలో, దిల్ రాజు ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఆ సినిమాకి తమన్ సంగీతం అందిస్తారని తెలిసింది. తమన్ గతంలో "కిక్, మిరపకాయ్, వీర" వంటి చిత్రాలకు సంగీతం అందించారు. తమన్ ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న"కందిరీగ" సినిమాకి, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "దూకుడు" సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
.jpg)
ఇప్పుడు ఆలిస్ట్ లో అల్లు అర్జున్ చిత్రం కూడా వచ్చి చేరింది. అల్లు అర్జున్ ముందు రెండు సినిమాలున్నాయి. అవి పూర్తయిన తర్వాత ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడు తమన్. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వాసూ వర్మ గతంలో నాగచైతన్య తొలిసారిగా హీరోగా నటించిన తొలి చిత్రం "జోష్"తో తొలిసారి దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం కూడా దిల్ రాజే నిర్మించటం విశేషం. కానీ "జోష్" సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాఢించకపోవటంతో మళ్ళీ దిల్ రాజే అతనికి రెండవ అవకాశమిచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



