అల్లు అర్జున్ సరసన శృతి హాసన్
on May 20, 2011
అల్లు అర్జున్ సరసన శృతి హాసన్ ఒక సినిమాలో నటింవబోతూందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, సెల్వరాఘవన్ (శ్రీరాఘవ) దర్శకత్వంలో త్వరలో ఒక భారీ బడ్జెట్ సినిమా నిర్మించబడబోతోందని తెలిసింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ "బద్రీనాథ్"అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమాలో కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించటానికి అంగీకరించాడు.
.jpg)
అలాగే శృతి హాసన్ కూడా యన్ టి ఆర్ సరసన బోయపాటి దర్శకత్వంలో, కె.యస్.రామారావు నిర్మిస్తున్న "టైగర్" (ఈ పేరు ఇంకా అధికారికంగా వెలువడలేదు) సినిమాలో హీరోయిన్ గా నటిస్తూంది. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాక అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించే సినిమా ఉంటుంది. శ్రీరాఘవ గతంలో "7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే" వంటి తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



