మంచు లక్ష్మి కల నెరవేరిన రోజు!
on Feb 12, 2022

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు నటించిన 'సన్నాఫ్ ఇండియా' సినిమా ఫిబ్రవరి 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించిన ఆయన తాజాగా మరో సినిమాని ప్రకటించారు. శనివారం లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాలో ఆయన కుమార్తె మంచు లక్ష్మి కూడా నటిస్తుండటం విశేషం.
శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా.. 'సన్నాఫ్ ఇండియా' డైరెక్టర్ డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ మూవీ నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డైరెక్టర్ నందినిరెడ్డి ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్ఛాన్ చేశాడు.

గతంలో తన కుమారులు విష్ణు, మనోజ్ లతో కలిసి నటించిన మోహన్ బాబు.. మొదటిసారి కుమార్తె లక్ష్మితో కలిసి నటిస్తుండటం విశేషం. ఈరోజు తన కల నిజమైన రోజు అని, తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నటిస్తుండటం చాలా సంతోషంగా ఉందని మంచు లక్ష్మి తెలిపింది.

సినిమా ప్రారంభమైన సందర్భంగా తన సోదరికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపి విష్ణు. "తన పేరు మీద ప్రారంభమైన శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో లక్ష్మి నటిస్తున్న మొదటి సినిమా ఇదేనని, అలాగే ఆమె తండ్రి మోహన్ బాబుతో కలిసి నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే" అని ట్వీట్ చేశాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



