Home

»

Latest News

ఫిబ్ర‌వ‌రి - మే.. మెగా కాంపౌండ్ సంద‌డే సంద‌డి!

Feb 12, 2022 4:44PM

2022 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ మెగా కాంపౌండ్ హీరోల‌కి ఎంతో ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. ఫిబ్ర‌వ‌రి నుంచి మే వ‌ర‌కు వ‌రుస‌గా నాలుగు నెల‌ల పాటు ఈ క్యాంప్ నుంచి ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఫిబ్ర‌వ‌రి 25న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన `భీమ్లా నాయ‌క్` గానీ లేదంటే మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన `గ‌ని` గానీ విడుద‌ల కానుండ‌గా.. మార్చి 25న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కానుంది. ఇక ఏప్రిల్ 28న వ‌రుణ్ తేజ్ న‌టించిన మ‌రో చిత్రం `ఎఫ్ 3` తెర‌పైకి రానుండ‌గా.. ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రూపొందిన `ఆచార్య‌` సంద‌డి చేయ‌నుంది. అలాగే మే నెల విష‌యానికివ‌స్తే.. ఆ నెలాఖ‌రున (మే 27) మెగా యంగ్ సెన్సేష‌న్ వైష్ణవ్ తేజ్ యాక్ట్ చేస్తున్న‌ `రంగ రంగ వైభ‌వంగా` ఎంట‌ర్టైన్ చేయ‌నుంది.

Also Read : మేలో 'రంగ రంగ వైభవంగా' వచ్చేస్తున్న మెగా హీరో!

కాగా, ఫిబ్ర‌వ‌రి 25న `భీమ్లా నాయ‌క్` విడుద‌ల కాని ప‌క్షంలో ఏప్రిల్ 1 ఆ సినిమాకి మ‌రో రిలీజ్ డేట్ ఆప్ష‌న్ అవుతుండ‌గా.. ఫిబ్ర‌వ‌రి 25న `భీమ్లా నాయ‌క్` రిలీజైన ప‌క్షంలో `గ‌ని` మార్చి 4న థియేట‌ర్స్ బాట ప‌ట్ట‌నుంది.

Also Read : `వాల్తేర్ మొన‌గాడు`గా మెగాస్టార్!?

ఏదేమైనా.. ఫిబ్ర‌వ‌రి నుంచి మే నెల వ‌ర‌కు వ‌రుస‌గా నాలుగు మాసాల పాటు తెలుగునాట మెగా కాంపౌండ్ సినిమాల సంద‌డి బాగానే ఉండ‌బోతోంద‌న్న‌మాట‌. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com