న్యూయార్క్‌లో బిల్ గేట్స్‌ను కలిసిన మహేశ్.. ఫొటో వైరల్!
on Jun 29, 2022

మహేశ్ బాబు తన కుటుంబంతో ప్రస్తుతం న్యూయార్క్‌లో సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో బిల్ గేట్స్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో మహేశ్ భార్య నమ్రత కూడా ఉంది. ఆ ఇద్దరూ బిల్ గేట్స్‌ను కలుసుకొనే అవకాశం చేజిక్కించుకొని, ఆయనతో విలువైన సమయాన్ని గడిపారు. ఆ ఫొటోను షేర్ చేసి, బిల్ గేట్స్‌ను ఒక విజనరీగా, ఒక ఇన్‌స్పిరేషన్‌గా అభివర్ణించాడు మహేశ్.
ఒక సినిమా పూర్తయ్యాక, మరో సినిమా చేయడానికి ముందు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేయడం, టైమ్‌ను ఎంజాయ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు మహేశ్. యు.ఎస్.కు వెళ్లడానికి ముందు, వారు ఇటలీకి వెళ్లి, అక్కడ రోడ్ ట్రిప్ కూడా వేశారు.
జూన్ 29న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ స్పెషల్ పిక్చర్‌ను షేర్ చేశాడు మహేశ్. తను, తన భార్య.. బిల్ గేట్స్‌ను కలిశామనీ, ఆయన వినయశీలత చూసి ఆశ్‌చర్యపోయామనీ అతను రాశాడు. బిల్ గేట్స్‌ను వారు ఓ రెస్టారెంట్‌లో కలుసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ ఫొటోను పంచుకుంటూ, "మిస్టర్ బిల్ గేట్స్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది! ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికుల్లో ఒకరు. అత్యంత వినయశీలి! నిజయం ఒక స్ఫూర్తిప్రదాత!!" అని రాసుకొచ్చాడు మహేశ్.
'సర్కారువారి పాట' సినిమా రిలీజయ్యాక, ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారను తీసుకొని యూకే, యూఎస్ ట్రిప్ వేశారు మహేశ్, నమ్రత. అప్పట్నుంచీ ఇద్దరూ ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ వస్తున్నారు. కాగా, త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన 28వ సినిమాని చేసేందుకు రెడీ అవుతున్నాడు మహేశ్. వచ్చే ఏడాది రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా నటించనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



