రేర్ ఫీట్.. హాలీవుడ్ బడా సినిమాల సరసన 'ఆర్ఆర్ఆర్'
on Jun 29, 2022

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ ఏడాది మార్చి 25 న థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన విజయం సాధించింది. మే 20 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ స్టార్లను సైతం మెప్పిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా మరో సంచలనాన్ని సృష్టించింది.

2022 ప్రథమార్ధానికి గాను 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్'(HCA) ప్రకటించిన బెస్ట్ పిక్చర్ కేటగిరిలో 'ఆర్ఆర్ఆర్' నామినేట్ అయింది. బెస్ట్ పిక్చర్ కేటగిరిలో 'టాప్ గన్ మావెరిక్', 'ది బ్యాట్ మ్యాన్' వంటి హాలీవుడ్ బడా సినిమాలతో సహా మొత్తం 10 సినిమాలు నామినేట్ కాగా అందులో 'ఆర్ఆర్ఆర్' చోటు దక్కించుకోవడం విశేషం. అంతేకాదు HCA అవార్డ్స్ కి నామినేట్ అయిన మొదటి ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు క్రియేట్ చేసింది. హాలీవుడ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్న 'ఆర్ఆర్ఆర్' మున్ముందు ఇంకెన్ని అద్భుతాలు సృష్టిందో చూడాలి.

కాగా ఇందులో కొమురం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ తమ నటనతో కట్టిపడేశారు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ కీలక పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



