మహేష్ సినిమా కోసం అడ్జస్ట్ చేస్తున్న మలయాళ హీరో!
on Oct 3, 2022

తెలుగు హీరోలు వరుసగా మలయాళ హీరోలకు తమ సినిమాల్లో కీ రోల్స్ ఇస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమాలో కీ రోల్ కోసం మలయాళం స్టార్ పృథ్విరాజ్‌ని అప్రోచ్ అవుతున్నారు నిర్మాతలు.
ఆల్రెడీ ప్రభాస్ నటిస్తున్న 'సలార్'లో కీ రోల్ చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు పృథ్విరాజ్. ఓ వైపు దర్శకుడిగా లూసిఫర్ సీక్వెల్ తీస్తున్నారు పృథ్విరాజ్. మరోవైపు ఆయన హీరోగా మలయాళంలో వరుసగా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందుకే మహేష్ మూవీ కోసం డేట్లు ఎక్కడ అడ్జస్ట్ అవుతాయా? అని ఆలోచిస్తున్నారట ఈ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్.
ఆల్రెడీ పుష్ప సినిమాతో ఫాహద్ ఫాజిల్ తెలుగు ఎంట్రీ ఇచ్చేశారు. భన్వర్‌సింగ్ షెకావత్ అసలు రూపం సీక్వెల్‌లో చూస్తారు అని ఇప్పటికే నార్త్ మీడియాకు చెప్పేశారు ఫాహద్.
మరోవైపు దేవ్‌మోహన్ కూడా తెలుగులో శాకుంతలంలో దుష్యంతుడిగా నటిస్తున్నారు. సమంత నటిస్తున్న యశోదలో హీరో ఉన్నిముకుందన్ నటిస్తున్నారు.
అక్కినేని చిన్నోడు అఖిల్ సినిమా ఏజెంట్‌లో మమ్ముట్టి కీ రోల్ చేస్తున్నారు. ఇదే ఒరవడి కంటిన్యూ అయితే 2023లో రిలీజ్ అయ్యే సినిమాల్లో కీ రోల్స్ అన్నిటిలోనూ మల్లు స్టార్స్ కనిపించే అవకాశాలు దండిగా ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



