మహేష్ అభిమానుల్లో గొడవలు... ఆగ్రహావేశాలు
on Dec 26, 2019

సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' విడుదలవుతున్న సందర్భంగా మహేష్‌తో అభిమానులు ఫొటోలు దిగే కార్యక్రమం ఒకటి బుధవారం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేశారు. మహేష్ వచ్చారు. కొందరు అభిమానులతో ఫొటోలు దిగారు. ఫొటో సెషన్ పూర్తిస్థాయిలో ప్రారంభం కాకమునుపే తొక్కిసలాట జరగడంతో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇద్దరు అభిమానులకు గాయాలు కావడంతో సమీపంలో ఆసుపత్రిలో చేర్పించారు.
మహేష్ వంటి సూపర్ స్టార్ అభిమానుల మధ్యకు వస్తున్న కార్యక్రమానికి సరైన ఏర్పాట్లు చేయలేదంటూ అభిమానులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రైన్‌లో బెర్తులు దొరక్కపోయినా రాత్రంతా నిలబడి తమ అభిమాన హీరోతో ఫొటో దిగాలని హైదరాబాద్ వచ్చామని.... నిద్రాహారాలు మాని పడిగాపులు పడ్డామని... తీరా ఫొటో దిగే సమయానికి నిర్వాహకుల తప్పిదంతో ఫొటో దిగలేకపోయామని అభిమానులు ఆవేదన చెందారు. ఏర్పాట్లు సరిగా చేయకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అలాగే, కొన్ని జిల్లాల మహేష్ అభిమానుల్లో గొడవలు కూడా మొదలయ్యాయి.
మహేష్‌తో ఫొటోలు పేరు చెప్పి కొన్ని ప్రాంతాల్లో అభిమానుల నుండి డబ్బులు వసూలు చేసి కొందరు తీసుకువచ్చారట. దీనిపై రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. అభిమాన హీరోతో ఫొటో దిగే అవకాశాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం నచ్చక మహేష్ అభిమాన సంఘం నుండి తప్పుకుంటున్నట్టు ఒకరు ట్వీట్ చేశారు. డబ్బులు ఇచ్చి హైదరాబాద్ వచ్చినవాళ్లు, డబ్బులు తీసుకున్న వాళ్ళతో గొడవలు పడుతున్నట్టు టాక్. ఇకపై ఇటువంటి ఫొటో సెషన్స్ ఏర్పాటు చేసే ముందు మహేష్ టీమ్ సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



